బకాయిల చెల్లింపుపై కార్మికుల ఆందోళన ..
- December 28, 2016
బైసన్ ఇంటర్నేషనల్ హోటల్ ఉద్యోగులు, తమకు యాజమాన్యం బకాయి పడ్డ వేతనాల చెల్లింపు కోసం ఆందోళన బాట పట్టాయి. గతంలో ఈ హోటల్ మేనేజ్‌మెంట్ చూసుకున్న రామీ గ్రూప్‌పై ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. 65 మంది ఉద్యోగులు, ఫైనల్ సెటిల్‌మెంట్ డ్యూస్ చెల్లింపులు లేక ఆందోళన చెందుతున్నారు. అక్టోబర్ 2016 వరకు రామీ గ్రూప్ ఈ హోటల్స్‌ని నిర్వహిస్తూ వచ్చింది. మేనేజ్‌మెంట్ మార్పు సమయంలో రామీ గ్రూప్, ఆ ఉద్యోగులకు చెల్లింపులపై హామీ ఇచ్చినా, ఆ హామీని నిలబెట్టుకోలేకపోయింది. గతంలో రామీ గ్రూప్ తరఫున పనిచేసిన ఆ ఉద్యోగులు ఇప్పుడు బైసన్ ఇంటర్నేషనల్ హోటల్‌లోనే వేరే మేనేజ్‌మెంట్‌తో పనిచేస్తున్నారు. బకాయిల్ని పాత మేనేజ్‌మెంట్ చెల్లించకపోవడంతో తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినట్లు వారు ఆందోళన చెందుతున్నారు. నిబంధనల ప్రకారం ఉద్యోగులు తమ జీతాల్ని పొందే హక్కుని కలిగి ఉన్నారనీ, మేనేజ్‌మెంట్‌కి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేసే అధికారం వారికి ఉందని ఓ ఫైనాన్షియల్ అడ్వయిజర్ తెలిపారు.
తాజా వార్తలు
- ఎన్ఆర్ఐలకు డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్యకు ప్రత్యేక అవకాశాలు
- తెలంగాణలో బతుకమ్మ సందడి..
- మెన్స్ హాకీ ఫైనల్లో భారత్ ఘన విజయం
- ఫ్లై దుబాయ్ పైలట్ స్మిత్ మచ్ఛర్‌ను పరామర్శించిన షేక్ హమ్దాన్దు
- బహ్రెయిన్ అంతర్జాతీయ మ్యూజిక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- యూఏఈలో ట్రక్కుల సేవలు, ఫుడ్ డెలివరీ ఛార్జీలు పెరుగుతాయా?
- మక్కా గ్రాండ్ మసీదులో సూసైడ్ బాంబర్ ప్రచారం ఫేక్..!!
- హత్య కేసు ఆధారాలు చెరిపేసే ప్రయత్నం.. వ్యక్తి డిపోర్టేషన్..!!
- డుక్మ్ స్పేస్‌పోర్ట్.. ‘అజాద్ డ్రీమర్’ రాకెట్ ప్రయోగం సక్సెస్..!!
- హార్ముజ్ జలసంధిలో రెండు చమురు ట్యాంకర్లపై దాడి..!!







