లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా 31న బాధ్యతలు చేపట్టనున్న అనిల్‌బైజల్‌

- December 29, 2016 , by Maagulf
లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా 31న బాధ్యతలు చేపట్టనున్న అనిల్‌బైజల్‌

దేశరాజధాని దిల్లీ కొత్త లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా నియమితులైన ఐఏఎస్‌ మాజీ అధికారి అనిల్‌ బైజల్‌ ఈనెల 31(శనివారం) పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. హైకోర్టు న్యాయమూర్తి సమక్షంలో ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. గవర్నర్‌గా బైజల్‌ నియామకాన్ని కాంగ్రెస్‌, అధికార పార్టీ ఆమ్‌ ఆద్మీ నేతలు స్వాగతించాయి. వ్యక్తిగత కారణాల వల్ల నజీబ్‌జంగ్‌ హఠాత్తుగా ఈనెల 22న లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. జంగ్‌ రాజీనామాను బుధవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోదం తెలిపి, కొత్త గవర్నర్‌గా అనిల్‌ బైజల్‌ ఎంపికను ఆమోదించారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com