రిపబ్లిక్ డే సందర్భంగా శంషాబాద్ ఏర్ పోర్టులో హై అలర్ట్..
- December 30, 2016
శంషాబాద్ ఏర్ పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు. గణతంత్ర వేడుకల నేపథ్యంలో BCAS ఆదేశాల మేరకు ఇవాళ్టి నుంచి జనవరి 30 వరకూ నెల రోజులపాటు సందర్శకుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. రిపబ్లిక్ డే సమీపిస్తుండడంతో దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని BCAS ఆదేశాలు జారీ చేసింది. నెల రోజుల పాటు సందర్శకుల పాసులను రద్దు చేసింది. కేవలం ప్రయాణికులను మాత్రమే ఏర్ పోర్టులోకి అనుమతిస్తారు. సందర్శకులను కేవలం పార్కింగ్ ఏరియా వరకే వెళ్లనిస్తారు. శంషాబాద్ విమానాశ్రయంలోకి వచ్చే ప్రతి వాహనాన్నీ CISF సిబ్బంది తనిఖీ చేస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..







