కశ్మీర్‌లో అల్లర్లు: ఎనిమిది మందికి గాయాలు..

- December 30, 2016 , by Maagulf
కశ్మీర్‌లో అల్లర్లు: ఎనిమిది మందికి గాయాలు..

 కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో చెలరేగిన అల్లర్లలో ఇద్దరు భద్రతాసిబ్బంది సహా ఎనిమిది మంది ఆందోళనకారులు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. గలందర్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం నేపథ్యంలో భద్రతాదళాలు ఆ ప్రాంతాన్ని చట్టుముట్టాయి. తనిఖీల్లో భాగంగా జాతీయరహదారిపై కొద్దిసేపు వాహనాల రాకపోకలను సైతం నిలిపివేశారు. అయితే ఈ సమయంలో ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపుతప్పింది. దీంతో వారిని అదుపుచేసేందుకు భద్రతాదళాలు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించాయి. గాల్లోకి కాల్పులు జరిపారు.దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇద్దరు ఆందోళనకారులకు బుల్లెట్‌ గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com