సెర్చ్‌ అండ్‌ ఫాలో అప్‌ డిపార్ట్‌మెంట్‌లో కొత్త సౌకర్యం

- December 30, 2016 , by Maagulf
సెర్చ్‌ అండ్‌ ఫాలో అప్‌ డిపార్ట్‌మెంట్‌లో కొత్త సౌకర్యం

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బోర్డర్‌, పాస్‌పోర్ట్‌ మరియు ఎక్స్‌పాట్రియేట్‌ ఎఫైర్స్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ బ్రిగేడియర్‌ మొహమ్మద్‌ అహ్మద్‌ అల్‌ అతిక్‌, విమెన్స్‌ రిసెప్షన్‌ / వెయిటింగ్‌ ఏరియాకి సంబంధించి కొత్త ప్రెమిసిస్‌ని ప్రారంభించారు. ఇందులో ఫింగర్‌ప్రింట్‌ మరియు కేస్‌ స్టడీ సెక్షన్లను ఇక్కడ ప్రారంభించడం జరిగింది. తమ శాఖ కంటిన్యువస్‌ డెవలప్‌మెంట్‌ని ప్రదర్శిస్తోందనీ, భవనాల విస్తరణ, కొత్త సౌకర్యాలను సంతరించుకుంటోందని బ్రిగేడియర్‌ అల్‌ అతిక్‌ చెప్పారు. రెసిడెన్సీ చట్టాన్ని అతిక్రమించిన వలసదారులకు సంబంధించి, వారి అభ్యర్థనల్ని స్వీకరించడం, 48 గంటల్లో వారిని స్వదేశానికి పంపించడం వంటి చర్యల్ని ఈ డిపార్ట్‌మెంట్‌ చేపడుతోంది. డిపార్ట్‌మెంట్‌ పరిసరాలు పూర్తిగా కొత్తగా మార్చబడ్డాయి. బెడ్స్‌, డైనింగ్‌ హాల్స్‌, మాస్క్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్‌ జోన్స్‌, క్లినిక్స్‌ ఇతర సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. డిపార్ట్‌మెంట్‌ కొత్త కమర్షియల్‌ కాంప్లెక్స్‌ని కూడా ప్రారంభించింది. ఇక్కడ ఫుడ్‌ ఐటమ్స్‌, ఇతర ఎస్సెన్షియల్‌ కమోడిటీస్‌, గార్మెంట్స్‌ వంటివి ఇన్‌మేట్స్‌ కోసం అందుబాటులో ఉంచుతున్నారు. తమవారితో టెలిఫోన్‌ సంభాషణ కోసం కూడా ఏర్పాట్లు చేశారు. ప్రారంభోత్సవంలో బ్రిగేడియర్‌ అబ్దుల్లా జబెల్‌ అల్‌ లబ్దా (మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ - సెర్చ్‌ అండ్‌ ఫాలో అప్‌ డిపార్ట్‌మెంట్‌ ఇన్‌ఛార్జ్‌) కూడా పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com