శాండ్‌ పెట్రోల్స్‌ని ప్రారంభించిన అబుదాబీ పోలీస్‌

- December 30, 2016 , by Maagulf
శాండ్‌ పెట్రోల్స్‌ని ప్రారంభించిన అబుదాబీ పోలీస్‌

అబుదాబీ పోలీసులు, శాండ్‌ పెట్రోల్స్‌ని ప్రారంభించారు. ఈ శాండ్‌ పెట్రోల్స్‌ ఎడారులు అలాగే ఇసుక ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మోహరించబడ్తాయి. టూరిస్టులు, ఫారినర్లు, అలాగే విజిటర్స్‌కి వీరు రక్షణగా ఉంటారు. అబుదాబీ పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ మేజర్‌ జనరల్‌ మక్తౌమ్‌ అలి అల్‌ షరిఫి ఈ శాండ్‌ పెట్రోల్‌ టీమ్‌ని దఫ్రా ఫెస్టివల్‌ సందర్బంగా ప్రారంభించారు. అప్‌ టు డేట్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్‌ని ఈ పెట్రోల్స్‌లో ఏర్పాటు చేశారు. మేజర్‌ జనరల్‌ అల్‌ షరిఫితోపాటు ఇద్దరు సీనియర్‌ అధికారులు వెస్టర్న్‌ రీజియన్‌లో జరిగే ఫెస్టివల్‌ని రివ్యూ చేశారు. 'వి ఆర్‌ పోలీస్‌' పేరుతో పోలీస్‌ పెట్రోల్స్‌ నిర్వహిస్తున్న కార్యకలాపాల్ని వీక్షించారు. స్మార్‌ట& పెట్రోల్స్‌ని కూడా ఈ సందర్భంగా రివ్యూ చేయడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com