జాగ్రత్తపడు! దీనిని నమ్మవద్దు !! ఖతార్ కార్మిక కార్యాలయం పేరిట అసత్య ప్రచారం

- December 30, 2016 , by Maagulf
జాగ్రత్తపడు!  దీనిని నమ్మవద్దు  !! ఖతార్ కార్మిక కార్యాలయం పేరిట అసత్య ప్రచారం

' కారు...కన్నా అధిక వేగం పుకారుకె ఉంది '....నిజం చెప్పులు వేసుకొనే లోపు అబద్ధం ప్రపంచం చుట్టి తిరిగొస్తుందట !! ఇందుకు సామాజిక మాధ్యమాలు బాగా ఇటీవల సహకరిస్తున్నాయి... అవాస్తవాలు  వ్యాపింప చేసి సామాన్య జనం అయోమయం చెందుతుంటే , ఆ  పైశాచిక ఆనందంతో తెగ సంబరపడి  వారు  అధికమయ్యారు. వీరి ఆగడాలకు ప్రభుత్వమే తలలు పట్టుకొంటుంది. ఏకంగా అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్, కార్మిక మరియు సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్మిక శాఖ పని వీసాలు మరియు అక్రమ నివాసితులు ఉద్యోగ బదిలీ అభ్యర్థనలను పూర్తిచేసే పని గురువారం మరియు శుక్రవారం రోజులలో సైతం తెరిచే ఉంటుందనే పుకార్లు సోషల్ మీడియా లో ప్రచారం జరిగింది. దీంతో సంబంధిత శాఖ ఆ ప్రకటనలతో తమది కాదని కొట్టి పారేశారు. అబద్ధపు ప్రచారంకు పూనుకొన్నవారు ప్రజలను ఎంతగా నమ్మించే యత్నం చేశారంటే  మంత్రిత్వశాఖ ముందు పలువురు గుమిగూడి ఉన్నట్లు..మంత్రిత్వశాఖ వాటిని సీరియస్గా  పరిశీలిస్తున్నట్లు గుర్తించబడని ఒక వీడియోతో అనుబంధితమైన పుకారు గురువారం సామాజిక మీడియాలో చక్కర్లు కొట్టాయి.అంతేకాక, పుకారులో మరో గమ్మత్తు ఏమిటంటే ,అంతర్గత మంత్రిత్వ శాఖ అక్రమ నివాసితులు వారి స్థితి మరియు మార్పు యజమానులను మార్చుకునేందుకు పది రోజుల దయాకాలం ఇచ్చిందని తప్పుడు ప్రచారం జరిగింది. అయితే ఈ అబద్ధపు పరిణామాలు నిజం కాదని..అవేమీ నమ్మవద్దని పేర్కొంటూ అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్, కార్మిక మరియు సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. ఉద్యోగ ఒప్పందం పూర్తి చేసిన వారికి ఉద్యోగం మార్పు కొరవచ్చని  కొత్త రెసిడెన్సీ చట్టం ప్రకారం, ఉద్యోగుల బదలీ సాధ్యం అని మంత్రిత్వ శాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com