కబాలి డిలీటెడ్‌ సీన్స్‌ ను విడుదల చేయనున్న కలైప్పులి ఎస్‌ థాను

- December 30, 2016 , by Maagulf
కబాలి డిలీటెడ్‌ సీన్స్‌ ను విడుదల చేయనున్న కలైప్పులి ఎస్‌ థాను

నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్న సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అభిమానులకు 'కబాలి' చిత్ర నిర్మాత ఓ అనూహ్య కానుకని అందించబోతున్నారు. 'కబాలి రా..' అంటూ ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద రజనీకాంత్‌ చేసిన సందడిని సినీ ప్రేక్షకులెవరూ మర్చిపోలేరు. ఇప్పుడు ఆ సినిమాలో తొలగించిన కొన్ని సన్నివేశాలను శనివారం యూట్యూబ్‌లో విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాత కలైప్పులి ఎస్‌ థాను ట్విట్టర్లో వెల్లడించారు. దీనికి కబాలిడిలీటెడ్‌ సీన్స్‌ అనే యాష్‌ ట్యాగ్‌ను జోడించారు. దీనికి అభిమానుల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఇండియాలో టాప్‌ ట్రెండింగ్‌గా నిలిచింది.

పారంజిత్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సంతోష్‌నారాయణన్‌ సంగీతం అందించారు. రాధికాఆప్టే కథానాయిక. మరోవైపు పా రంజిత్‌ దర్శకత్వంలో మరో సినిమాను చేయబోతున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి ధనుష్‌ నిర్మాతగా వ్యవహరించబోతుండటం మరో విశేషం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com