అఖిలేష్ పై 6 ఏళ్ళు వేటు వేసిన ములాయం సింగ్
- December 30, 2016
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీలో అగ్నిపర్వతం పేలింది. అధినేత ములాయం సింగ్ యాదవ్..తన కుమారుడు, యూపీ సీఎం అయిన అఖిలేశ్ యాదవ్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. సోదరుడు రాంగోపాల్ యాదవ్‌పైనా వేటు వేశారు. ఈ ఇద్దరినీ ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ములాయం శుక్రవారం లక్నో లోని పార్టీ కార్యాలయంలో ప్రకటించారు.
మరి కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ టికెట్ల వ్యవహారం తండ్రీకొడుకుల మధ్య దూరాన్ని మరింత పెంచింది. సీఎం అఖిలేశ్ సూచించినవారికి కాకూడా తనకు నచ్చిన వారికే టికెట్లు కేటాయిస్తూ ములాయం 325 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.
ఇది జరిగిన గంటల వ్యవధిలోనే తండ్రి నిర్ణయాన్ని ధిక్కరిస్తూ అఖిలేశ్.. 235 మంది పేర్లతో కూడి రెబర్స్ జాబితాను ప్రకటించారు. అఖిలేశ్ తిరుగుబాటు చర్యను తీవ్రంగా పరిగణించిన ములాయం.. శుక్రవారం ఉదయం షోకాజ్ నోటీసులు జారీచేశారు. మరి కొద్ది గంటల్లోనే అఖిలేశ్ సహా రాంగోపాల్ యాదవ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!
- ముబారక్ అల్-కబీర్‌లో మహిళ, ఇద్దరు పిల్లలు మృతి..!!
- యూఏఈలో వాహనాలతో గ్యారేజీలు ఫుల్..!!
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం







