చమురు ధరల తగ్గుదలపై అధ్యయనానికి ప్రత్యేక బృందాలు

- September 09, 2015 , by Maagulf
చమురు ధరల తగ్గుదలపై అధ్యయనానికి ప్రత్యేక బృందాలు

ఒమాన్ దేశ ఆర్ధిక వ్యవహారాలు మరియు శక్తి వనరుల మండలి యొక్క2015 సంవత్సరపు 5వ సమావేశం, ఆర్ధిక వ్యవహారాల మంత్రి మరియు మండలి డెప్యూటీ ఛైర్మన్ - డర్వీ బిన్ ఇస్మైల్ బిన్ అలీ అల్ బాలుషీ వారి అధ్యక్షతన ఈ మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో- ప్రపంచ విపణిలో చమురు ధరల నేపధ్యం మరియు 2015 సంవత్సరం జనవరి నుండి ఆగస్టు నెలల మధ్య వ్యవధిలో అకౌంట్లు, వాటి ఫలితాలు వంటి విషయాలను సమీక్షించారు. చమురు ధరల తగ్గుదల యొక్క ఫలితాలను అధిగమించేందుకు, వ్యయాల క్రమబద్ధీకరణ మరియు ఇంధనేతర వనరుల నుండి ఆదాయం పెంపుదల వంటి చర్యలు తోడ్పడ్దాయని మండలి తెలియజెప్పింది. ఈ లోటును ఎదుర్కోవడానికి, సుల్తానేట్ ఆర్ధిక స్థితి పెంపుదలకు అవసరమైన మరిన్న చర్యలను గురించి కూడా చర్చించింది. ఇంకా, మధ్య మరియు దీర్ఘకాల వ్యవధిలో ఆర్ధిక స్థితిని పెంపొందించడానికి అవసరమైన అధ్యయనం కోసం, ప్రత్యేక బృందాల ఏర్పాటును సిఫార్సు చేసింది.

 

--నూనె లెనిన్ కుమార్(ఒమాన్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com