సబ్జీ మిలానీ హరియాలి
- September 09, 2015
ఈ రోజు మనం పాలకూర తో చేసే ఒక వెరైటీ వంటకాన్ని చూద్దామా.. అదే 'సబ్జీ మిలానీ హరియాలి'
కావలసిన పదార్ధాలు:
- జీలకర్ర - 1 టీ స్పూను
- ఉల్లిపాయలు - 2 (సన్నగా తరిగినది)
- గరం మసాలా - 1 టేబుల్ స్పూను
- ధనియాల పొడి - 1 టేబుల్ స్పూను
- జాజికాయ పొడి - 1 టీ స్పూను
- కసూర్ మేతి - 2 టేబుల్ స్పూన్లు
- క్రీమ్ - 1 టేబుల్ స్పూను
- మిక్స్డ్ వెజిటబుల్స్(ఉడికించినవి) - 2 కప్పులు (క్యారట్, బీన్స్, పచ్చి బఠాణీ, కార్న్ ముక్కలు, క్యాలిఫ్లవర్)
- ఆయిల్ - 5 టేబుల్ స్పూన్లు
- ఉప్పు - తగినంత
- పసుపు - చిటికెడు
పేస్టు కొరకు:
- ఉల్లిపాయలు - 1
- పాలకూర - 1 కట్ట
- అల్లం - చిన్న ముక్క
- వెల్లుల్లి - 3 రెబ్బలు
- కొత్తిమీర - 1/2 కట్ట (కాడలతో)
- పచ్చి మిరపకాయలు - 5 (మీ రుచికి సరిపడా)
తయారు చేయు విధానం:
- ముందుగా ఒక మూకుడు లో కాస్త నూనె వేసి వేడిచేయండి.
- ఇందులో పేస్టు కు చెప్పిన పదార్ధాలు వేసి కాసేపు వేపండి. పాలకూర ను కూడా వేసి మగ్గించండి.
- ఈ మిశ్రమాన్ని చల్లారిన తర్వాత పేస్టు చేసుకొని పక్కన పెట్టుకోండి.
- ఇప్పుడు అదే బాండీలో మరి కాస్త నూనె తీసుకొని వేడిచేయండి.
- ఇందులో జీలకర్ర వేసి చిటపట లాడే దాకా వేయించండి.ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు వేసి ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చేదాకా వేయించండి.
- ఇప్పుడు ధనియాల పొడి, జాజికాయ పొడి, ఉడికించిన వెజిటబుల్ ముక్కలు వేసి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి.
- ఇప్పుడు పక్కన పెట్టుకున్న పేస్టు ను వేసి బాగా కలపండి.
- క్రీమ్, ఉప్పు, గరం మసాలా, కసూర్ మేతి వేసి ఒక 10 నిమిషాలు ఉడికించి స్టవ్ మీద నుండి దించేయండి.
- ఇది రోటి తో లేదా బిర్యాని తో తింటే ఎన్తూ రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం







