పొగమంచు, వర్షంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి..
- December 30, 2016
రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) మోటరిస్టులు డ్రైవింగ్ జాగ్రత్తగా చేయాలని విజ్ఞప్తి చేసింది. పొగమంచు, వర్షం కారణంగా లో విజిబిలిటీ ఏర్పడుతుందనీ, వాహనాలు నడిపే సమయంలో ఏమాత్రం అప్రమత్తంగా లేకున్నా ప్రమాదాలు జరగవచ్చునని హెచ్చరించింది ఆర్టిఎ. పొగమంచు, వర్షాల కారణంగా తలెత్తే రోడ్డు ప్రమాదాల పట్ల అవగాహనా కార్యక్రమాల్ని చేపడుతున్నట్లు ఆర్టిఎ సిఇఓ మైతా మొహమ్మద్ బిన్ అదాయ్ చెప్పారు. ముందు వెళుతున్న వాహనంతో తగినంత దూరం పాటించడం, వాహనాన్ని నడుపుతున్నప్పుడు దృష్టి మరలే ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడం, విండ్ షీల్డ్, విండోస్ క్లీన్గా ఉన్నాయో లేదో చూసుకోవడం, పరిమిత వేగంతోనే ప్రయాణించడం, అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఫోర్ లైట్ హజార్డ్ని వినియోగించకపోవడం, వాహన సామర్థ్యం సరిగ్గా ఉందో లేదో చూసుకోవడం, టైర్లు, వైపర్స్, హెడ్లైట్స్, బ్రేక్స్ విషయంలో తగిన జాగ్రత్తలు చూపడం వంటివాటి ద్వారా ప్రమాదాల్ని కొంతమేర తగ్గించుకోవచ్చునని ఆర్టిఎ సూచిస్తోంది.
తాజా వార్తలు
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ
- ప్రభుత్వ AI ఇండెక్స్..సౌదీ అరేబియా నెంబర్ వన్..!!
- స్మార్ట్ఫోన్ యూజర్స్ ను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం
- రికార్డు సృష్టించిన స్మృతి మంధాన







