రవితేజ రీమేక్ తో ఎంట్రీ..
- December 31, 2016
సినీ ప్రముఖుల వారసులు మాత్రమేకాదు.. రాజకీయనాయకుల వారసులు కూడా వెండితెరపై మెరిసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చాలా మంది రాజకీయనాయకుల వారసులు సినీరంగంలో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అదే బాటలో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు రవితేజ. ఏపి మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు రవితేజ త్వరలో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.
అయితే తొలి సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న రవితేజ, రీమేక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. తమిళ్ లో ఘనవిజయం సాధించిన సేతుపతి సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాకు రీమేక్ స్పెషలిస్ట్ జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇప్పటికే లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతోంది.
తాజా వార్తలు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు
- దుబాయ్‌లో ఘనంగా ప్రవాస తెలుగువారి క్రూజ్ క్రిస్మస్ వేడుకలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు
- క్రైస్తవుల భద్రతకు భంగం రానివ్వం: సిఎం చంద్రబాబు







