బ్రెజిల్‌లోని న్యూ ఇయర్ పార్టీ లో విషాదం
- January 01, 2017
బ్రెజిల్‌లోని కాంపినాస్ పట్టణంలోని ఒక ఇంట్లో జరిగిన పార్టీలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 11మంది మృతి చెందారు. సావోపౌలోని పోలీసు వర్గాల కథనం ప్రకారం తన మాజీ భార్యతో విభేదాల కారణంగా హంతకుడు కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఈ కాల్పుల్లో హంతకుడి మాజీ భార్య, ఎనిమిదేళ్ల కుమారుడు కూడా మృతిచెందాడు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. మొత్తం 15 మందిపై కాల్పులు జరపగా 11 మంది మృతి చెందారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు బాణాసంచా కాలుస్తుండటంతో ఈ ఘటనను స్థానికులు గుర్తించలేకపోయారు. ఒక బాధితుడు రక్తమోడుతూ వచ్చి సాయం కోరడంతో వెలుగులోకి వచ్చింది.
తాజా వార్తలు
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!
- సోమాలిలాండ్ గుర్తింపును తిరస్కరించిన కువైట్..!!







