మధ్యాహ్నం పూట లంచ్ టైమ్‌లో వేపుళ్ళు వద్దు.. కంప్యూటర్లతో చర్మ సమస్యలు?

- January 01, 2017 , by Maagulf
మధ్యాహ్నం పూట లంచ్ టైమ్‌లో వేపుళ్ళు వద్దు.. కంప్యూటర్లతో చర్మ సమస్యలు?

లంచ్ టైమ్‌లో తీసుకునే ఆహారంలో పోషకాలుండేలా చూసుకోవాలి. మధ్యాహ్నం పూట తీసుకునే ఆహారంలో నూనె ఉండకుండా చూసుకోవాలి. అందుకే వేపుళ్లు తీసుకోకూడదు. వాటివల్ల కడుపులో గ్యాస్‌ ఏర్పడుతుంది. పనిచేయడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని పండ్ల ముక్కలను వెంట తెచ్చుకుంటే సాయంత్రం స్నాక్స్‌కు బదులు అల్పాహారంగా తీసుకోవచ్చు. వాటి నుంచి పోషకాలు అందుతాయి. సులభంగా జీర్ణమవుతాయి కూడా.
 
అలాగే కంప్యూటర్ల ముందు గంటల తరబడి పనిచేసేవారు ప్రతి ఇరవై నిమిషాలకోసారి కళ్లు మూసి తెరుస్తూ ఉండాలి. దానివల్ల కళ్లు అలసటకు గురికాకుండా ఉంటాయి. ఇదో చక్కటి వ్యాయామం. కంప్యూటర్ల వల్ల శరీరానికి రేడియేషన్‌ ప్రభావం ఎక్కువగా ఉండి చర్మం పొడిబారుతుంది. అందుకని సన్‌స్క్రీన్‌ లోషన్‌ వెంట పెట్టుకొంటే రెండుమూడు గంటలకోసారి రాసుకొంటే సరిపోతుంది. ఎలాంటి చర్మ సంబంధిత సమస్యలు రావు.
 
రాత్రి ఎనిమిది గంటలలోపే డిన్నర్‌ చేయడం ఉత్తమం. లేట్‌గా తింటే తొందరగా నిద్రపట్టదు. రాత్రి సమయంలో ఎక్కువ నీళ్లు తాగకూడదు. అంతేకాదు రాత్రి సమయంలో ఎక్కువగా టీవీ చూస్తే కళ్లు ఒత్తిడికి గురవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com