2017 తొలి ట్రేడింగ్‌లో పసిడి ధర..
- January 02, 2017
గత కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తోన్న పసిడి ధరకు 2016 డిసెంబర్ 31న బ్రేకులు పడిన సంగతి తెలిసిందే. ఆ రోజున 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.200 తగ్గి రూ.28,300 పలికింది. నిన్న ఆదివారం.. జనవరి 1వ తేదీ కావడంతో బులియన్ ట్రేడింగ్ జరగలేదు. 2017లో ట్రేడింగ్ తొలిరోజైన సోమవారం పసిడి ధరలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. 10 గ్రాములు స్వచ్ఛమైన బంగారం రూ.28,300 వద్దే ట్రేడింగ్‌ను కొనసాగించడం గమనార్హం. ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు స్తబ్దుగా ఉండటంతో లావాదేవీలు ఆశించినంత స్థాయిలో జరగలేదని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి.
మరోపక్క వెండి ధర రూ.100 తగ్గి, కిలో వెండి రూ.39,300 పలికింది.
పరిశ్రమల వర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లకు ఆసక్తి చూపకపోవడంతో వెండి ధర స్వల్పంగా తగ్గిందని విశ్లేషకులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం
- ఇక పై వాట్సాప్‌లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్..
- ప్రాంతాల అభివృద్ధికి సీఎం రేవంత్ ఆదేశాలు
- సైబరాబాద్ సీపీగా డాక్టర్ ఎం.రమేశ్ బాధ్యతలు స్వీకరణ
- యాదగిరిగుట్టలో వైభవంగా ముక్కోటి ఏకాదశి మహోత్సవం
- యూట్యూబర్ అన్వేష్ పై ఆగ్రహం..అతని దిష్టి బొమ్మ దగ్ధం
- పాన్-ఆధార్ లింకింగ్ కు రేపే చివరి తేదీ
- అనధికార ఆయుధాల రవాణాపై సౌదీ ఫోకస్..!!
- షేక్ ఇసా బిన్ సల్మాన్ కాజ్వే- అవెన్యూ 105 బ్రిడ్జి ప్రారంభం..!!
- ఖతార్ లో జనవరి 19 నుండి DIMDEX 2026..!!







