అగ్ని-4 పరీక్ష విజయవంతం..
- January 02, 2017
భారత్ క్షిపణి కార్యక్రమంలో మరో ముందడుగు పడింది. అగ్ని-5 పరీక్షను విజయవంతంగా నిర్వహించిన వారం తర్వాత అగ్ని-4ను శాస్త్రవేత్తలు పరీక్షించారు. ఒడిశాలోని బాలాసోర్ పరీక్షా కేంద్రంలో ఈ పరీక్ష నిర్వహించారు. ఈ క్షిపణిలో రెండు రకాలు ఉన్నాయి. ఉపరితలం మీద నుంచి ఉపరితలంపైకి ప్రయోగించేది 20 మీటర్ల పొడవు, 17టన్నుల బరువు ఉంది. ఇది దాదాపు నాలుగువేల కిలోమీటర్ల దూరం వరకు టన్ను బరువైన వార్‌హెడ్‌ను మోసుకువెళుతుంది. అగ్ని-4కు నిర్వహించిన పరీక్షల్లో ఇది నాలుగోది. ఈ క్షిపణిని డీఆర్డీవో అభివృద్ధి చేసింది. త్రివిధ దళాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని దీనిని అభివృద్ధి చేశారు.
ఈ ఐదేళ్లలో నిర్వహించిన అగ్ని-4 ప్రయోగాల్లో ఒక్కటి మాత్రమే విఫలమైంది.
తాజా వార్తలు
- పాన్-ఆధార్ లింకింగ్ కు రేపే చివరి తేదీ
- అనధికార ఆయుధాల రవాణాపై సౌదీ ఫోకస్..!!
- షేక్ ఇసా బిన్ సల్మాన్ కాజ్వే- అవెన్యూ 105 బ్రిడ్జి ప్రారంభం..!!
- ఖతార్ లో జనవరి 19 నుండి DIMDEX 2026..!!
- సహల్ యాప్ ద్వారా రెసిడెన్సీ తొలగింపు సర్వీస్..!!
- దుబాయ్ లో పబ్లిక్ పార్క్ వేళలు పొడిగింపు..!!
- ఫేక్ CPA వెబ్సైట్ ట్రాప్..ROP హెచ్చరికలు..!!
- JEE అడ్వాన్స్డ్ 2026 షెడ్యూల్ వచ్చేసింది..
- శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్
- తిరుమల మాదిరిగా యాదగిరిగుట్టలో ప్రత్యేక సేవలు







