సుప్రీం కోర్టు గేటు దగ్గర ఆత్మహత్య..
- January 02, 2017
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ముందు సోమవారం ఉదయం జరిగిన ఓ ఘటన విషాదాన్ని నింపింది. సుప్రీం కోర్టు దగ్గర భద్రతా సిబ్బందిలో ఒకరైన చాంద్ పాల్ సోమవారం ఉదయం కోర్టు గేటు ఎదుట తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జీ గేట్ దగ్గర ఈ ఘటన జరిగింది. పని ఒత్తిడే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని చాంద్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్పాట్లోనే చనిపోయినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు గల కారణాలేంటో పూర్తి స్థాయిలో తెలియలేదు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో సుప్రీం కోర్టు పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు నిశ్శబ్ధం అలుముకుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







