సుప్రీం కోర్టు గేటు దగ్గర ఆత్మహత్య..

- January 02, 2017 , by Maagulf
సుప్రీం కోర్టు గేటు దగ్గర ఆత్మహత్య..

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ముందు సోమవారం ఉదయం జరిగిన ఓ ఘటన విషాదాన్ని నింపింది. సుప్రీం కోర్టు దగ్గర భద్రతా సిబ్బందిలో ఒకరైన చాంద్ పాల్ సోమవారం ఉదయం కోర్టు గేటు ఎదుట తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జీ గేట్ దగ్గర ఈ ఘటన జరిగింది. పని ఒత్తిడే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని చాంద్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్పాట్‌లోనే చనిపోయినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు గల కారణాలేంటో పూర్తి స్థాయిలో తెలియలేదు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో సుప్రీం కోర్టు పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు నిశ్శబ్ధం అలుముకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com