2017 తొలి ట్రేడింగ్‌లో పసిడి ధర..

- January 02, 2017 , by Maagulf
2017 తొలి ట్రేడింగ్‌లో పసిడి ధర..

గత కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తోన్న పసిడి ధరకు 2016 డిసెంబర్‌ 31న బ్రేకులు పడిన సంగతి తెలిసిందే. ఆ రోజున 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.200 తగ్గి రూ.28,300 పలికింది. నిన్న ఆదివారం.. జనవరి 1వ తేదీ కావడంతో బులియన్‌ ట్రేడింగ్‌ జరగలేదు. 2017లో ట్రేడింగ్‌ తొలిరోజైన సోమవారం పసిడి ధరలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. 10 గ్రాములు స్వచ్ఛమైన బంగారం రూ.28,300 వద్దే ట్రేడింగ్‌ను కొనసాగించడం గమనార్హం. ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు స్తబ్దుగా ఉండటంతో లావాదేవీలు ఆశించినంత స్థాయిలో జరగలేదని బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు తెలిపాయి.
మరోపక్క వెండి ధర రూ.100 తగ్గి, కిలో వెండి రూ.39,300 పలికింది.

పరిశ్రమల వర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లకు ఆసక్తి చూపకపోవడంతో వెండి ధర స్వల్పంగా తగ్గిందని విశ్లేషకులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com