అరబ్‌ మహిళకు వేదింపులు

- January 02, 2017 , by Maagulf
అరబ్‌ మహిళకు వేదింపులు

మనామా: మద్యం సేవించి ఉన్న ఓ అరబ్‌ మహిళ వేధింపులకు గురయ్యింది. ఓ మహిళ, ఓ వ్యక్తి ఇద్దరూ సౌదీ అరేబియా నుంచి వచ్చినవారిగా భావిస్తున్నారు. న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ కోసం వచ్చిన ఈ ఇద్దరూ పార్టీ అనంతరం బయటకు వచ్చారు. వీరిద్దరి మధ్యా తగాదా చిలికి చిలికి గాలివానలా తయారైంది. ఒకర్ని ఒకరు దూషించుకున్నారు, గొడవ ముదిరి కొట్లాటగా మారింది. అయితే మహిళను కొట్టిన వ్యక్తి మాత్రం మద్యం సేవించి ఉన్నట్లుగా కన్పించలేదు. కాస్సేపటి తర్వాత ఆ మహిళ స్నేహితురాలు అక్కడికి వచ్చి, ఆమెను తీసుకెళ్ళారు. భారీకాయంతో ఉండటంతో ఆమెను కారులోకి ఎక్కించడానికీ ఆమె స్నేహితురాలు ఇబ్బంది పడింది. గొడవకు గల కారణాలు ఇంకా తెలియవలసి ఉంది. చూసినవారు మాత్రం ఈ గొడవతో షాక్‌కి గురయ్యారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com