సోమాలియా ఎయిర్‌పోర్ట్‌లో పేలుళ్లు..ముగ్గురి మృతి
- January 02, 2017
సోమాలియా రాజధాని మొగదిషులోనివిమానాశ్రయంలో సోమవారం వరుస పేలుళ్లు సంభవించాయి. అనంతరం భారీగా కాల్పులు కూడా జరిగినట్లు సమాచారం. పేలుళ్లలో ముగ్గురు భద్రతా సిబ్బంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. విమానాశ్రయంలో సిబ్బంది లేని చెక్‌పాయింట్ వద్ద మొదటి పేలుడు సంభవించింది. అనంతరం పీస్ హోటల్ ఆవరణలో రెండో పేలుడు సంభవించినట్లు పేర్కొన్నారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల భవనాలు ధ్వంసం అవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్పారు.
ఈ పేలుళ్లకు ఎవరు పాల్పడ్డారన్న వివరాలు తెలియరాలేదు కానీ ఇంతకుముందు అల్ షబాబ్ ఉగ్రవాదులు పలుమార్లు సోమాలియాపై విరుచుకుపడ్డారు.అదీకాకుండా సోమాలియా ఫెడరల్ పార్లమెంట్ త్వరలో తమ నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంది.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







