ప్రతిరోజు క్రమంతప్పకుండా వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని తీసుకుంటే...
- January 02, 2017
వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని ప్రతిరోజు పరకడుపున తీసుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఈ మిశ్రమాన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల రక్త నాళాల్లో ఏర్పడే కొవ్వుని తొలగించి, గుండెకు రక్తప్రసరణ వేగంగా జరగడానికి సహాయపడుతుంది. వెల్లుల్లి, తేనె మిశ్రమం గొంతు నొప్పి, గొంతులో ఇన్ఫెక్షన్‌ని నివారిస్తుంది. ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉండటం వల్ల వాపును తగ్గిస్తుంది.
జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఎలాంటి వ్యాధినైనా నయం చేసే శక్తి వెల్లుల్లి, తేనె మిశ్రమంలో ఉంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ నేచర్ కోలన్‌లో ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. ఈ మిశ్రమాన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల జలుబు, ఫ్లూ, సైనసైటిస్‌లు దరిచేరవు. ఈ మిశ్రమంలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల శరీరంలో ఏర్పడే ఎలాంటి బ్యాక్టీరియానైనా నాశనం చేస్తుంది. శరీరంలోని మలినాలను, హానికారక క్రిములను శరీరం నుంచి బయటకు పంపుతుంది.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







