బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదుల కలకలం !
- January 02, 2017
జమ్ముకశ్మీర్ బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదుల సంచారం స్థానికంగా కలకలం రేపింది. జవాన్లకు, ఉగ్రవాదులకు మధ్య హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నాయి. కొందరు ఉగ్రవాదులు హరితర్ తర్జు ప్రాంతంలో సంచరింస్తున్నారని సమాచారం అందుకున్న జవాన్లు ఉగ్రవాదుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కాల్పులకు పాల్పడ్డ ఓ ఉగ్రవాదని జవాన్లు హతమార్చినట్లు సమాచారం. ఉగ్రవాది వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని జవాన్లు స్వాధీనం చేసుకున్నారు.
మరో ఉగ్రవాది అదే ప్రాంతంలో నక్కినట్లు జవాన్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ రెండో ఉగ్రవాదిని పట్టుకోవడానికి ఆర్మీ కూంబింగ్ జరుపుతోంది. దాడులకు పాల్పడే ఉద్దేశంతోనే ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో బారాముల్లా జిల్లాలోకి ఉగ్రవాదులు ప్రవేశించినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







