బ్రెజిల్ జైల్లో ఘర్షణ ..60 మంది మృతి..
- January 02, 2017
తరచూ జైళ్లలో ఘర్షణలతో నెత్తురోడే బ్రెజిల్‌లో మరో ఘోరం! అమెజానియా రాష్ట్ర రాజధాని మానౌజ్‌లో ఓ జైల్లో రెండు గ్యాంగుల మధ్య జరిగిన ఘర్షణల్లో 60 మంది ఖైదీలు మృతిచెందారు. పలువురిని తుపాకీ కాల్పులతోపాటు గొంతుకోసి, శరీరాలను ఛిద్రం చేసి చంపారు. ఆదివారం మధ్యాహ్నం మొదలైన ఘర్షణలు సోమవారం ఉదయం వరకు కొనసాగాయని ప్రజా భద్రత కార్యదర్శి సెర్గో ఫాంటెస్ చెప్పారు.
కొందరు ఖైదీలు తప్పించుకున్నారని, జైలు సిబ్బందిలో పలువురిని ఖైదీలు నిర్బంధించారని తెలిపారు. తమపై దాడులు జరక్కుండా చూడాలని డిమాండ్ చేసిన ఖైదీలు ఓ జడ్జి మధ్యవర్తిత్వంతో 12 మంది జైలు సిబ్బందిని విడుదల చేయడంతో ఘర్షణలు ముగిశాయి.
జైళ్లలో పట్టుకోసం గత ఏడాది రెండు నేరగాళ్ల ముఠాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలు తాజా ఘటనకు కారణమని భావిస్తున్నారు. మరోపక్క.. ఇదే రాష్ట్రంలోని మరో జైలు నుంచి సోమవారం తెల్లవారుజామున 87 మంది ఖైదీలు తప్పించుకున్నారు.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







