ఇరాక్ రాజధాని లో ఆత్మాహుతి దాడి..
- January 02, 2017
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో సోమవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో కనీసం 36 మంది మృతి చెందగా, 56 మంది గాయాల పాలయ్యారు. నగరంలోని అత్యంత రద్దీగా ఉంగే సద్దర్ పట్టణం కూడలి గల ఓ మార్కెట్ వద్ద ఓ వ్యక్తి భారీగా పేలుడు పదార్థాలతో కూడిన కారుతో సహా తనని తాను పేల్చుకున్నాడని పోలీసులు చెప్పారు. ఈ దాడిలో చనిపోయిన వారిలో ఎక్కువ మంది దినసరి కూలీలే ఉన్నట్లు తెలిపారు.
బాగ్దాద్‌కు ఈశాన్యన ఉన్న ఈ ప్రాంతాల్లో ఎక్కువగా షియాలు నివసిస్తుంటారని, గత కొంతకాలంగా ఈ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
ఈ దాడికి కారణం ఎవరనేది ఇంకా తెలియరాలేదు. కాగా, ఇది ఉగ్రవాదుల దాడిగా అధికారులు భావిస్తున్నారు. గత మూడు రోజుల్లో బాగ్దాద్‌లో ఇది రెండో భారీ దాడి. బాగ్దాద్‌లోని రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో శనివారం జరిగిన దాడిలో 27 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్ లో ఇల్లీగల్ ఫైర్ వర్క్స్ స్టాక్ సీజ్..!!
- ఒమన్ లో ఇకపై ప్రీ మారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరి..!!
- లుసైల్‌లో ఫైర్ వర్క్స్ ప్రదర్శనను వీక్షించిన 250,000 మంది పైగా ప్రజలు..!!
- కోమాలో బాధితుడు.. 25 రోజుల తర్వాత BD25,000 పరిహారం..!!
- యూఏఈలో మెజారిటీ వయస్సు 18 సంవత్సరాలకు తగ్గింపు..!!
- సౌదీలో 116 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!







