చిత్ర నిర్మాత శాండ్రా థామస్‌పై దాడి..
- January 04, 2017
చిత్ర నిర్మాత శాండ్రా థామస్‌పై దాడి చేశారంటూ నటుడు విజయ్ బాబుపై కేసు నమోదైంది. సోమవారం ఎలమక్కరలోని తన కార్యాలయంలో విజయ్ తనపై దాడి చేశారంటూ శాండ్రా థామస్ మంగళవారం కేసు నమోదు చేయించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. అయితే.. తనపై తప్పుడు కేసు నమోదు చేశారంటూ విజయ్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. తాను నమ్మిన తన వ్యాపార భాగస్వామి, ఆమె భర్త తనపై తప్పుడు కేసు నమోదు చేయించారని అందులో రాశారు.
శాండ్రా, విజయ్ కలిసి ఫ్రైడే ఫిల్మ్ హౌస్ అనే నిర్మాణ సంస్థను నడుపుతున్నారు. ఈ పతాకంపై దాదాపు 10 చిత్రాలను నిర్మించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







