ప్రత్యేక పార్కింగ్ స్థలం నోబెల్ గ్రహీతల కోసమే..
- January 04, 2017
నోబెల్ పురస్కారం ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది. ఈ అవార్డుకు ఎంపికైన వారు నగదు బహుమతి.. పతకం.. స్వీడీష్ రాజు చేతుల మీదుగా పురస్కారం అందుకుంటారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా పేరుప్రతిష్టలు వస్తాయి. ఎక్కడికి వెళ్లినా వీఐపీ హోదాలో అతిథి మర్యాదలు చేస్తారు. అయితే.. ఓ యూనివర్శిటీ మాత్రం వారికి వినూత్న గౌరవం ఇచ్చింది. తమ క్యాంపస్‌లో నోబెల్ గ్రహీతలకు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాన్ని కేటాయించింది.
బెర్కెలీలోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా క్యాంపస్‌లో నిత్యం విద్యార్థులు..
స్కాలర్లు.. ఉపాధ్యాయులతో సందడి వాతావరణం ఉంటుంది. వాళ్ల వాహనాలతో అక్కడి పార్కింగ్ స్థలం కూడా పార్కింగ్ ఫుల్ బోర్డు పెట్టేంతగా నిండిపోతుందట. అందుకే యూనివర్శిటీ యాజమాన్యం నోబెల్ గ్రహీతల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాన్ని కేటాయించింది.
పార్కింగ్ స్థలంపై నోబెల్ ల్యారియేట్ రిజర్వడ్ (నోబెల్ గ్రహీతలకు మాత్రమే) అని రాసి ఉంచింది. ఒకవేళ వారు లేనిపక్షంలో యూనివర్శిటీలో దశబ్ధాల పాటు బోధిస్తున్న ఆచార్యులు పార్కింగ్ చేసుకోవచ్చట. ఇంతకీ కేవలం నోబెల్ గ్రహీతలకు ఎందుకు అలా కేటాయించారంటే.. 1980లో పోలాండ్‌కి చెందిన రచయిత జెస్లా మిలొజ్ నోబెల్ బహుమతి అందుకున్న తర్వాత ఒక కోరిక కోరాడట.
యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో తన కారు పార్కింగ్ చేసుకునేందుకు స్థలం కావాలని అన్నాడట. వెంటనే ఆ యూనివర్శిటీ యాజమాన్యం ఆయన కోరిక మేరకు పార్కింగ్ స్థలాన్ని కేటాయించింది. అలా కేటాయించిన ప్రత్యేక పార్కింగ్ స్థలం నోబెల్ గ్రహీతల కోసమే రిజర్వ్ చేయడం సంప్రదాయంగా కొనసాగుతోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







