కతార్లో నీటిని, విద్యుత్ ను వృధా చేసినవారికి 20,000 కతార్ రియాల్స్ వరకు జరిమానా

- September 10, 2015 , by Maagulf
కతార్లో నీటిని, విద్యుత్ ను వృధా చేసినవారికి 20,000 కతార్ రియాల్స్ వరకు జరిమానా

కతార్ లో నిన్న ఎమీరి దివాన్ లో జరిగిన సాధారణ వారపు సమావేశంలో, ప్రధానమంత్రి మరియు ఆంతరంగిక శాఖామాత్యులు హిజ్ హైనెస్ షేక్ అబ్దుల్లా బిన్ నస్సెర్ బిన్ ఖలీఫా అల్ థని అధ్యక్షత జరిగిన సమావేశంలో ఉప ప్రధాని మరియు కేబినెట్ వ్యవహారాల రాష్ట్ర మంత్రి హిజ్ హైనెస్ ఆమెద్ బిన్ అబ్దుల్లా బిన్ జైద్ మహ్మౌద్, విద్యుత్తు మరియు నీటి వాడకాన్ని గురించి సలహా మండలి సిఫార్సుల మేరకు సంబంధిత  చట్టాన్ని సవరించినట్టు తెలిపారు. దీనిప్రకారం, భవనాల బాహ్య కాంతి సదుపాయాలకు యాంత్రిక తాళాలను అమరుస్తారు. ఇంకా భవనాలు, నివాస గృహాల యజమానులు లేదా అద్డేకుండేవారు - తాగునీటిని కార్లు, వరండాలు  లేదా ఇతర వస్తువులను నీటి పైపుల ద్వారా కదగడానికి  ఉపయోగిస్తే .. వరకు జరిమానా విధించబడుతుంది. ఇంకా ఉదయం 7 గంటలనుండి సాయంత్రం 4.30 వరకు గోడలు, భవనాల బయట, బహిరంగ లేదా వ్యక్తిగత లైట్లు వేసి వదిలివేస్తే, 10,000 వరకు జరిమానా విధించబడుతుంది.

 

--వి. రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,కతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com