బహ్రైన్ లో పాఠశాలలు తెరిచినంతనే మొదలైన దాడులు!

- September 10, 2015 , by Maagulf
బహ్రైన్ లో  పాఠశాలలు తెరిచినంతనే మొదలైన దాడులు!

కొత్త విద్యా సంవత్సరం మొదలై వారం రోజులయ్యాయో లేదో, పాఠశాలలపై కిటికీల అద్దాలు పగలగొట్టడం మొదలుకొని, పెట్రోలు బాంబులను విసరడం దాకా రకరకాల దాడులు జరిగా యనీ బహ్రైన్ విద్యా శాఖ వారు వెల్లడించారు. ఈ క్రమంలో, సా'అద్ బిన్ అబీ వకాస్ ఎలిమెంటరీ స్కూల్ ఫర్ బాయ్స్ పై విధ్వంసకారులు రాళ్లు విసరగా కిటికీలు పగిలాయని, అల్ ఏ'అలీ ప్రైమరీ స్కూల్స్ ఫర్ గర్ల్స్ ను లక్ష్యంగా చేసుకుని, పెట్రోలు బాంబులను విసిరారు. ఇంకా ముంతార్ బిన్ సవీ ఎలిమెంటరీ స్కూల్ ఫర్ బాయ్స్ పై పెట్రోలు బాంబులు విసరినపుడు మంటలు రేగగా, వాటిని ఆర్పివేశామని; 2011 నుండి ఇప్పటివరకు 350 కి పైగా ఇటువంటి సంఘటనలు నమోదయ్యాయని  సదరు శాఖ తెలిపింది. కాగా, బహ్రైన్ విద్యా జీవితంలో పవిత్రమైన విద్యాలయాలపైఈ విధమైన దాడులు జరగడం విచారకరం.

 

--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రైన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com