ఈ నెల 12 నుంచి బెజవాడలో ఎయిర్ షో
- January 05, 2017
దేశంలో అత్యధిక అభివృద్ధి సాధించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు అన్నారు. విజయవాడలో జనవరి 12 నుంచి 14 వరకు జరిగే విమానయాన సదస్సు, ఎయిర్ షో గోడ పత్రికను గురువారం దిల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పౌర విమానయాన శాఖ, ఏపీ ప్రభుత్వం, ఫిక్కీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సును ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారన్నారు. 200మంది దేశీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థల ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ప్రతినిధులు వస్తారని వెల్లడించారు.రీజినల్ కనెక్టివిటీపై ఈ సదస్సులో చర్చ జరుగుతుందని చెప్పారు. ఎయిర్‌షోను యునైటెడ్ కింగ్డమ్ నిర్వహిస్తుందన్నారు. జనవరి 12న విజయవాడ రన్‌వే విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్టు చెప్పారు. రూ.130 కోట్లతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనం ప్రారంభిస్తామని కేంద్రమంత్రి వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







