అమెరికాలో భారతీయ విద్యార్థులకు షాక్... బాధితుల్లో అత్యధికులు తెలుగువారే !.....

- January 05, 2017 , by Maagulf
అమెరికాలో భారతీయ విద్యార్థులకు షాక్... బాధితుల్లో అత్యధికులు తెలుగువారే !.....

వాషింగ్టన్ : అమెరికాలో చదువుతున్న వేలాది మంది భారతీయ విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. వీరిలో తెలుగువారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అమెరికా విద్యా శాఖ తీసుకున్నఒక సంచలన నిర్ణయం ఈ పరిస్థితికి దారితీసింది. పరిష్కార మార్గాల కోసం ఆంధ్రపదేశ్ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం, అక్కడి తెలుగు సంఘం తానా కార్యవర్గ ప్రతినిధులు న్యాయ నిపుణులను, విద్యాసంస్థల వారిని సంప్రదిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని స్వతంత్ర కళాశాలలు, పాఠశాలలకు జాతీయస్థాయి సంస్థ అయిన 'అక్రిడిటింగ్ కౌన్సిల్ ఫర్ ఇండిపెండెంట్ కాలేజెస్ అండ్ స్కూల్స్ (ఏసీఐసీఎస్)' గుర్తింపు ఇస్తుంటుంది.
గత నెలలో అమెరికా విద్యా శాఖ ఏసీఐసీఎస్ గుర్తింపునే రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రాం (ఎస్ఈవీపీ) కింద ఏసీఐసీఎస్ గుర్తింపునిచ్చిన 130 కళాశాలలు, పాఠశాలల్లో చదువుతున్న సుమారు 16 వేల మంది అంతర్జాతీయ విద్యార్థులపై ప్రభావం చూపుతుందని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ స్వయంగా వెల్లడించింది. బాధితుల్లో ఎక్కువమంది భారత సంతతి విద్యార్థులు కాగా, వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల సంఖ్య మరింత ఎక్కువని తెలుస్తోంది.
గుర్తింపు ఎందుకు రద్దు చేశారు?
1912లో ఏసీఐసీఎస్‌ను ఏర్పాటు చేశారు. సాంకేతిక, వృత్తి విద్యా కళాశాలలకు ఆ జాతీయ మండలి ఇచ్చే గుర్తింపు తప్పనిసరి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. 245 విద్యా సంస్థలను ఏసీఐసీఎస్‌ పర్యవేక్షిస్తోంది. వాటిలో చాలావరకు లాభాపేక్షతో పనిచేస్తున్నవే. వాటిలో సుమారు 60,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. గత ఏడాది ప్రభుత్వ సహాయం కింద సుమారు 4.76 బిలియన్ డాలర్లు ఆయా సంస్థలకు అందాయి. ఏసీఐసీఎస్‌పై పనితీరులో లోపాల నేపథ్యంలో ఉన్నతస్థాయి బృందం లోతైన దర్యాప్తు చేపట్టింది. బోగస్, ప్రమాణాలు లేని కళాశాలకు సైతం గుర్తింపు ఇచ్చిందని దర్యాప్తు బృందం తన నివేదికలో పేర్కొంది. విద్యార్థులు, పన్ను చెల్లింపుదారుల ప్రయోజనాలకు కాపాడలేకపోయిందని అభిశంసించింది. దరిమిలా విద్యా శాఖ గుర్తింపు రద్దు చేసింది. ఇటీవల ఏసీఐసీఎస్‌ గుర్తింపునిచ్చిన రెండు కళాశాలలు మూతపడడం గమనార్హం.
భవిష్యత్తు అగమ్య గోచరం
ఏసీఐసీఎస్‌ ద్వారా గుర్తింపు పొందిన కళాశాలలకు అమెరికా విద్యా శాఖ 18 నెలల గడువు ఇచ్చింది. ప్రభుత్వ నిధులు పొందాలంటే ఈలోగా కొత్తగా గుర్తింపు పొందవలసి ఉంటుంది. చాలా విద్యా సంస్థలు అక్రిడిటింగ్ కమిషన్ ఆఫ్ కెరీర్ స్కూల్స్ అండ్ కాలేజెస్ (ఏసీసీఎస్‌సీ)ను ఆశ్రయిస్తున్నాయి. అలాగే ప్రభుత్వం విధించిన కొత్త షరతులకు ఆయా విద్యాసంస్థలు అంగీకరించాల్సి ఉంటుంది. అయితే 24 నెలల వ్యవధి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమేటిక్స్ (ఎస్‌టీఈఎం) ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రయినింగ్ (ఓపీటీ) కోసం దరఖాస్తు చేసుకున్న ఎఫ్-1 స్టూడెంట్స్ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.
యూనివర్సిటీతో సంప్రదింపులు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com