మధుమేహం మటాష్ ప్రతిరోజూ ఒక కప్పు ఆకుకూర తీసుకుంటే..
- January 05, 2017
ప్రతిరోజూ ఒక కప్పు ఆకుకూర తీసుకునే వారిలో మధుమేహం వచ్చే ప్రమాదం 14శాతం తగ్గించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. లేదంటే ఆకుకూరలు వారానికి మూడు సార్లు తీసుకుంటూ వుండాలని వారు సూచిస్తున్నారు. ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆకుకూరల్లోని విటమిన్-బీ పాలెట్స్ జ్ఞాపకశక్తి, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
వీటిల్లోని విటమిన్-ఏ కంటిచూపును మెరుగు పరుస్తుంది. గుండె సంబంధిత వ్యాధులకు దారితీసే అమైనో ఆమ్లాలనూ నియంత్రిస్తాయి. ముఖ్యంగా పొన్నగంటి కూరలో ఏ విటమిన్ అధికం. దీనిని తింటే రేచీకటి రాదు. శరీరానికి చలువ కూడా. పేగుల్లోకి వెళ్లిన వెంట్రుకలను సైతం కరిగించే శక్తి దీనికుంది. ఇక కూరల్లోగానీ, పచ్చడిగా గానీ పుదీనా తీసుకుంటే మెదడు చురుగ్గా ఉంటుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
ఇక బరువు తగ్గించడంలోనూ ఆకుకూరలు ఎంతగానో ఉపయోగ పడతాయి. ఆకుకూరల్లోని విటమిన్ కె బరువును తగ్గిస్తుంది. ఇక ఆకుకూరల్లో క్యాలరీలు, కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







