ప్రభాస్ ను ఇంటికి పంపేసిన రాజమౌళి.....

- January 05, 2017 , by Maagulf
ప్రభాస్ ను ఇంటికి పంపేసిన రాజమౌళి.....

దాదాపు నాలుగేళ్లుగా బాహుబలి సినిమాకే పరిమితమైన హీరో ప్రభాస్ ఫ్రీ అయ్యాడు. బాహుబలి రెండో భాగంలో ప్రభాస్ కనిపించే సన్నివేశాల చిత్రీకరణ పూర్తవ్వటంతో ప్రభాస్ ను విడుదల చేస్తున్నట్టుగా చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ విషయాన్ని బాహుబలి సినిమా అఫీషియల్ సోషల్ మీడియా పేజ్ లో అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో నటించిన ఇతర నటీనటులందరూ బాహుబలితో పాటు వేరే సినిమాల్లో కూడా నటించారు. కానీ ప్రభాస్ మాత్రం మరో సినిమా అంగకీరించకుండా బాహుబలికే పరిమితమయ్యాడు.
సినిమాలో కీలక పాత్ర కావటంతో పాటు బాహుబలి కనిపించటం కోసం భారీ కండలు, పొడవాటి జుట్టుతో మహారాజులా మారిపోయాడు ప్రభాస్. ఆ లుక్ తో ఇతర సినిమాలు చేయటం కుదరకపోవటం. బాహుబలి కోసమే శారీరకంగా, మానసికంగా విపరీతమైన శ్రమ పడటంతో గ్యాప్ వచ్చిన సినిమాలు చేసేందుకు ప్రభాస్ ఆసక్తికనబరచలేదు.
ఇప్పుడు బాహుబలి రెండో భాగం కూడా పూర్తవ్వటంతో ప్రభాస్ ఇక నార్మల్ లుక్ లో కనిపించనున్నాడు. త్వరలోనే రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటించేందుకు అంగీకరించాడు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com