గల్ఫ్‌కు తరలిస్తున్న గంజాయి పట్టివేత....
- January 05, 2017
రాజంపేట టౌన్(కడప) : గల్ఫ్‌దేశాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంభందించి డీఎస్పీ రాజేంద్ర తెలిపిన వివరాల ప్రకారం... బుధవారం సాయంత్రం పుల్లంపేట మండలం వత్తలూరు గ్రామానికి చెందిన సురేష్‌కుమార్, చిత్తూరు జిల్లా తట్టివేడు మండలం సి.పి.ఎన్.కండ్రికకు చెందిన వెంకటేశ్వర్లును మన్నూరు సీఐ హేమ సుందర్రావు పోలీస్ సిబ్బందితో దేవసముద్రం ఆంజనేయ విగ్రహం వద్ద పట్టుకున్నట్లు తెలిపారు. వారి వద్ద 3కేజీల గంజాయి ఉండ టంతో వారిని పట్టుకొని అరెస్ట్ చేశామని, వారు కువైత్‌లోని స్మగ్లర్లకు, గల్ఫ్‌దేశాల స్మగ్లర్లకు ఈ గంజాయిని సరఫరా చేసేవారన్నారు. అలాగే 3వ తేదీన మన్నూరు స్టేషన్ పరిధిలో 6.2 కేజీల గంజాయి, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు.
గంజాయి, మాదకద్ర వ్యాలు కలిగిన ఉన్న వారిపై అక్రమరవాణా చేసేవారిపై స్మగ్లర్లపై ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక నిఘాను ఉంచి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం పోలీసులను డీఎస్పీ అభినందించారు. నిందితులను రిమాండ్‌కు తరలించామన్నారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







