తెలంగాణ అసెంబ్లీలోకి బాలకృష్ణ.....
- January 06, 2017
హైదరాబాద్: సినీ నటుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ శుక్రవారం తెలంగాణ అసెంబ్లీలోకి వెళ్లారు. ఈ సందర్భంగా తెతెదేపా నేత రేవంత్‌రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవడానికి వచ్చిన బాలకృష్ణ.. నేరుగా అసెంబ్లీలోని తెదేపా కార్యాలయానికి వెళ్లారు. 'గౌతమిపుత్ర శాతకర్ణి'కి తెలంగాణలో రాయితీ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు బాలకృష్ణ ధన్యవాదాలు తెలపనున్నారు.
క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చారిత్రక చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'. శ్రియ కథానాయిక. హేమమాలిని కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలకృష్ణ సినీ కెరీర్‌లో నటించిన 100వ చిత్రం కావడంలో అటు అభిమానుల్లోనూ, ఇటు చిత్ర పరిశ్రమలోనూ భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!
- ఖతార్ లో 31 ఆహార సంస్థలు సీజ్..!!
- మా యాత్రికులు సౌదీ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నారు: ఇరాన్
- బీమా రంగంలో నగదు లావాదేవీలపై నిషేధం..!!
- ఈద్ అల్ అదా: మలేరియా నుంచి రక్షణకు డాక్టర్ల సూచనలు..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై సయ్యద్ బదర్ సమీక్ష..!!
- డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం..కంపెనీ మేనేజర్ అరెస్ట్
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు









