4 కిలోల హెరాయిన్ కల్గి ఉన్నఇరువురు పాకిస్థానీయులకు జీవిత ఖైదు

- January 06, 2017 , by Maagulf
4 కిలోల హెరాయిన్ కల్గి ఉన్నఇరువురు పాకిస్థానీయులకు జీవిత ఖైదు

మనామా:4 కిలోల హెరాయిన్ కల్గి ఉన్నఇరువురు పాకిస్థానీయులకు జీవిత ఖైదుని సుప్రీం అప్పీల్స్ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ ఇద్దరు నిందితులు  మూహ్యాయరాక్ అంతటా మాదక ద్రవ్యాన్ని సరఫరా చేసే డ్రగ్ లార్డ్  ఒక నెట్వర్క్ లో చురుకైన సభ్యులని వీరు ఈ డ్రగ్గులను రహస్యంగా  దాచి పెట్టడంలోనూ ఎంతో దిట్టలని తెలుస్తోంది. ఈ అక్రమ వ్యాపారంలో సూత్రధారికి  వినియోగదారులే నేరుగా  డబ్బు పాకిస్తాన్ కు బదిలీ చేయాలని సూచిస్తారు. వీరి అక్రమ్ మాధకద్రవ్యాల వ్యాపారం గూర్చి సమాచారం అందుకొన్న పోలీసులు ఒక కిటుకు ఉపయోగించి వారు ఉన్న గదిపై దాడి చేసి దాదాపు నాలుగు కిలోగ్రాముల బరువు ఉన్న హెరాయిన్ ను స్వాధీనం చేసుకొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com