ఏమి ఈ ఘోర కలి!

- January 06, 2017 , by Maagulf
ఏమి ఈ ఘోర కలి!

బ్రెజిల్‌లోని అమెజాన్ ప్రాంతంలో గల ఓ జైల్లో ఘర్షణ జరిగి 33 మంది ఖైదీలు మరణించారు. సరిగ్గా ఐదు రోజుల క్రితం ఇదే దేశంలోని మరో జైల్లో జరిగిన ఘోర దుర్ఘటనలో 56 మంది ఖైదీలు మరణించిన ఘటనను ఇంకా మర్చిపోకముందే ఇప్పుడు మరో దారుణం జరగడం గమనార్హం.
రోరైమా రాష్ట్రంలోని అతిపెద్ద జైల్లో తాజా దుర్ఘటన జరిగింది. బ్రెజిల్ జైళ్ల వ్యవస్థను ఎక్కువగా గ్యాంగులే నియంత్రిస్తుంటాయని, అందువల్ల సమీప భవిష్యత్తులో మరిన్ని ఘర్షణలు చోటుచేసుకోవచ్చని అంటున్నారు. ఇప్పుడు కూడా డ్రగ్స్ గ్యాంగుల మధ్య చెలరేగిన వివాదమే గొడవకు కారణమని తెలుస్తోంది. రెండు వేర్వేరు క్రిమినల్ గ్యాంగులకు చెందిన ఖైదీల మధ్య గొడవ జరిగి, ఒకరినొకరు నరికి చంపుకుంటున్న ఘటనలు అక్కడ తరచు చోటుచేసుకుంటున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com