రిపబ్లిక్ డే కి రానున్న 'ఎస్3'
- January 07, 2017
హిట్ కాంబినేషన్ సూర్య - హరిల తాజా చిత్రం 'ఎస్3' అనుకున్నది సాధించింది. క్రిస్మస్కు విడుదల కావాల్సిన ఈ చిత్రం అనివార్య కారణాలతో వాయిదాపడి రిపబ్లిక్ డే రోజున తెరపైకి రాబోతోంది. 'సింగం' తొలి రెండు భాగాలకు మించిన భారీ బడ్జెట్‌తో అంతర్జాతీయ స్థాయి కథాంశంతో తెరకెక్కిన 'ఎస్3'కి సెన్సార్ బోర్డు 'యు/ఏ' ఇచ్చి షాకిచ్చిన విషయం తెలిసిందే. దీంతో చిత్ర యూనిట్ రివైజ్డ్ కమిటీకి వెళ్లింది. దర్శకుడు హరి సెన్సార్ బోర్డుతో పోరాడి మరీ యు సర్టిఫికెట్ సాధించారట. దీంతో 'ఎస్3' యూనిట్ ఆనందోహత్సాహాల్లో ఉంది. అనుకున్నది దక్కడంతో చిత్ర విజయంపై హరి ధీమాతో వున్నారు. సూర్య ఖాతాలో మరో బ్లాక్‌బ్లస్టర్ ఖాయమని ఆయన అభిమానులు ఆశాభావంతో వున్నారు. కాగా, ఈ చిత్రంలో సూర్యకు జోడీగా అనుష్క, శ్రుతిహాసన నటించగా, హారీస్ జయరాజ్ సంగీతం సమకూర్చారు. తమిళం, తెలుగు భాషల్లో ఒకేరోజు 'ఎస్3' తెరపైకి రానుంది.
తాజా వార్తలు
- కేరళలో ఘనంగా మొదలైన పూరం సంబరాలు
- యూఏఈ సంచలన నిర్ణయం..50% సేవలు AIతోనే
- ఓడించే పార్టీ విజయ్ టీవీకే!
- ET బిజినెస్ రిఫార్మర్ అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు
- యూపి ట్రిపిల్ మర్డర్: కేక్ పూయడం పై గొడవ..ముగ్గురు స్నేహితుల కాల్చివేత!
- సోషల్ మీడియాలో ఫేక్ వీసా,ఆఫర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- వైట్‌హౌస్ డిన్నర్ వద్ద కాల్పులు..షూటర్ ఫోటో విడుదల
- ట్రంప్ డిన్నర్ టైంలో కాల్పులు..పరుగులు పెట్టిన సెక్యూరిటీ
- సౌదీ అరేబియాలో బార్డర్ దాటుతూ..1,454 మంది అరెస్టు..!!
- ద్వైపాక్షిక సంబంధాలపై బహ్రెయిన్, కువైట్ చర్చలు..!!









