అమెరికా రాయబారి పదవినుండి వైదొలగనున్న రిచర్డ్ రాహుల్‌వర్మ
- January 07, 2017
భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్ రాహుల్‌వర్మ జనవరి 20కి ముందే తన పదవి నుంచి వైదొలగనున్నారు! ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా నియమించిన రాయబారులను కొనసాగించేందుకు అమెరికా భావి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుముఖంగా లేరు. ఈ నేపథ్యంలో ఆయన ప్రమాణ స్వీకారానికి ముందే కొందరు అధికారులు వైదొలగనున్నారు.
అమెరికాలో ఈ పదవి పొందిన తొలి భారతీయ అమెరికన్ రిచర్డ్‌వర్మ (48) కావడం విశేషం. ఆయన హయాంలో భారత్, అమెరికా సంబంధాలు మరింత బలపడ్డాయి. అమెరికా చట్టసభల్లో భారత్‌కు అనుకూలంగా పౌర అణు ఒప్పందం ఆమోదింపచేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 2014లో అమెరికాలో భారత రాయబారి దేవయానీ కోబ్రాగడే వివాదం కారణంగా అప్పటి అమెరికా రాయబారి నాన్సీపావెల్ స్థానంలో రిచర్డ్‌వర్మను ఒబామా నియమించారు.
తాజా వార్తలు
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త
- తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- తెలంగాణ: గణతంత్ర దినోత్సవం..తెలంగాణకు 23 పోలీస్ పతకాలు
- మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో జరిగిన తేనీటి విందు
- ఖతార్లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!







