పోర్చుగల్ ప్రధానితో భేటీ అయిన నరేంద్ర మోదీ
- January 07, 2017
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టా ప్రత్యేక బహుమతిని అందజేశారు. ఆ దేశ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో పేరు ఉన్న జెర్సీని ప్రధాని మోదీకి కోస్టా బహుకరించారు. శనివారం వీరిద్దరూ సమావేశమై ఇరు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య కీలకమైన ఆరు ఒప్పందాలపై ఆయా దేశ ప్రతినిధులు సంతకాలు చేశారు. ఇందులో రక్షణ సహకార ఒప్పందం ఉంది. ఏడు రోజుల పాటు ఆంటోనియో భారత్‌లో పర్యటించనున్నారు. బెంగళూరులో జరుగుతున్న ప్రవాస భారతీయ దివస్‌కు రెండు రోజుల పాటు ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. శనివారం పోర్చుగల్ ప్రధాని ఆంటోనియోకు రాష్ట్రపతి భవన్లో త్రివిధ దళాల బృందం సైనిక వందనం సమర్పించింది. అనంతరం ఆయన రాజ్‌ఘాట్‌లోని మహాత్ముడి సమాధిని దర్శించుకొని నివాళులర్పించారు.
తాజా వార్తలు
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త
- తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- తెలంగాణ: గణతంత్ర దినోత్సవం..తెలంగాణకు 23 పోలీస్ పతకాలు
- మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో జరిగిన తేనీటి విందు
- ఖతార్‌లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్‌లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!







