'రాజా మీరు కేక'లో కీలక పాత్ర పోషించనున్న తారకరత్న

- January 07, 2017 , by Maagulf
'రాజా మీరు కేక'లో కీలక పాత్ర పోషించనున్న తారకరత్న

రేవంత్‌, నోయల్‌, లాస్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'రాజా మీరు కేక'. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ఇటీవల చిత్ర బృందం విడుదల చేసింది. అయితే ఇందులో నటుడు తారకరత్న కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుపుతూ.. ఆయన ఫస్ట్‌లుక్‌ను తాజాగా విడుదల చేసింది. ఓ పాడుపడ్డ ఇంటిలో తారకరత్నను కుర్చీలో కట్టేసి ఉంచినట్లు ఈ ఫస్ట్‌లుక్‌లో చూపించారు. టి. కృష్ణ కిషోర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 'గుంటూరు టాకీస్‌' నిర్మాతలు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ దాదాపు పూర్తైనట్లు సమాచారం. ఫిబ్రవరిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com