'రాజా మీరు కేక'లో కీలక పాత్ర పోషించనున్న తారకరత్న
- January 07, 2017
రేవంత్, నోయల్, లాస్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'రాజా మీరు కేక'. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ఇటీవల చిత్ర బృందం విడుదల చేసింది. అయితే ఇందులో నటుడు తారకరత్న కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుపుతూ.. ఆయన ఫస్ట్‌లుక్‌ను తాజాగా విడుదల చేసింది. ఓ పాడుపడ్డ ఇంటిలో తారకరత్నను కుర్చీలో కట్టేసి ఉంచినట్లు ఈ ఫస్ట్‌లుక్‌లో చూపించారు. టి. కృష్ణ కిషోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 'గుంటూరు టాకీస్' నిర్మాతలు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తైనట్లు సమాచారం. ఫిబ్రవరిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: గణతంత్ర దినోత్సవం..తెలంగాణకు 23 పోలీస్ పతకాలు
- మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో జరిగిన తేనీటి విందు
- ఖతార్‌లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్‌లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!
- మస్కట్‌లో వెల్లివిరిసిన భారత గణతంత్ర స్ఫూర్తి..!!
- బహ్రెయిన్ తేవర్ పెరవై ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం..!!







