అక్కడ సాయం చేస్తే రెండువేల రూపాయలు రివార్డు
- January 07, 2017
ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన వాళ్లను ఇకపై దిల్లీ ప్రభుత్వం రివార్డు ఇచ్చి సత్కరించనుంది. ప్రమాద బాధితులను ఆసుపత్రిలో చేర్పిస్తే వారికి రూ.2000 బహుమతిగా ఇచ్చే విధానానికి దిల్లీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రజల్లో సేవా దృక్పథాన్ని పెంపొందించడంతో పాటు బాధితులకు సహాయం చేయడాన్ని ప్రోత్సహించడమే ముఖ్య ఉద్దేశంగా ఈ విధానాన్ని పెట్టినట్లు దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తెలిపారు. అంతేకాదు సహాయం చేసిన వ్యక్తికి ప్రభుత్వం తరపు నుంచి ప్రశంసాపత్రాన్ని అందజేస్తామన్నారు. కళ్ల ముందు గాయాలతో ఉన్న వ్యక్తికి సహాయం చేయకుండా మనకెందుకులే అని వెళ్లిపోతున్న వారికి ఇదొక కనువిప్పు కావాలి. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకే ఈ రెండువేల రూపాయల రివార్డు ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!
- మస్కట్లో వెల్లివిరిసిన భారత గణతంత్ర స్ఫూర్తి..!!
- బహ్రెయిన్ తేవర్ పెరవై ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం..!!
- బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
- శుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!







