ఉత్తర్‌ప్రదేశ్‌లో నైట్ షెల్టర్‌లోకి దూసుకెళ్లిన కారు, 4 మృతి
- January 07, 2017
ఒక నైట్ షెల్టర్‌లోకి కారు దూసుకెళ్లి నలుగురు మృతి చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడినసంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో ఈ తెల్లవారుజామున చోటుచేసుకుంది. లఖ్‌నవూ నడిబొడ్డున దలీబాగ్ ప్రాంతంలో ఒక హుందాయ్ ఐ 20కారు నైట్షెల్టర్లోకి వేగంగా దూసుకెళ్లింది.ప్రమాదం జరిగిన సమయంలో ఆ షెల్టర్‌లో దాదాపు 35 మంది కూలీలు నిద్రిస్తున్నారు. వీరంతా రోజు కూలీ నిమిత్తం బరాచీ జిల్లా నుంచి వచ్చినవారు కావడం గమనార్హం. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం తర్వాత కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ పనిచేస్తున్న కూలీలు వారిని పట్టుకున్నారు. వీరిలో ఒకరు స్థానిక రాజకీయ నాయకుడి కుమారుడు కాగా మరొకరు ఓ వ్యాపారవేత్త కుమారుడిగా గుర్తించారు.
తాజా వార్తలు
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం
- సౌదీ అరేబియాలో వైభవంగా ‘తెలుగింటి సంక్రాంతి’ సంబరాలు
- పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు వీళ్ళే..
- అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్‌గా ఇచ్చిన తలైవా
- పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
- నాంపల్లి అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్







