రానా కోసం అమితాబ్, ఎన్టీఆర్...
- January 07, 2017
టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో రానా. హీరో, విలన్, సపోర్టింగ్ రోల్ ఇలా అన్ని రకాల పాత్రలతో అలరిస్తున్న ఈ మ్యాన్లీ స్టార్ నటిస్తున్న బహు భాషా చిత్రం ఘాజీ. భారత్ పాక్ యుద్ధ సమయంలో మునిగిపోయిన ఓ సబ్ మెరైన్ కథతో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది. పీవీపీ సినిమాస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీతో సంకల్ప్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు అదనపు ఆకర్షణలు జోడించే పనిలో ఉన్నారు చిత్రయూనిట్. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ అందిస్తున్నారట.
అదే వాయిస్ ను తెలుగు వర్షన్ కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ అందించేందుకు అంగీకరించాడు. త్వరలోనే ఈ వాయిస్ ఓవర్ లతో కూడిన ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.
తాజా వార్తలు
- తైవాన్‌లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించిన అమెరికన్ సాహసవీరుడు..!!
- సౌదీ పోర్టుల్లో 965 ప్రొహిబిటేడ్ ఐటమ్స్ సీజ్..!!
- దుబాయ్‌లో ఆస్తి కొనుగోలు చేస్తున్నారా?
- కువైట్ లోని లులు హైపర్ మార్కెట్లో ఇండియా ఉత్సవ్ వేడుకలు..!!
- 2050 నాటికి 83.6 మిలియన్లకు జీసీసీ జనాభా..!!
- బహ్రెయిన్ లో చైల్డ్ కేర్ కోసం కఠిన నిబంధనలు..!!
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు







