పోర్చ్‌గల్ ప్రజాస్వామ్య పిత సోయారిస్ మృతి...
- January 08, 2017
ఇంటర్నెట్‌డెస్క్: పోర్చ్‌గల్ ప్రజాస్వామ్య పితగా భావించే మాజీ అధ్యక్షుడు మారియో సొయారీస్ (92) కన్నుమూశారు. సోయారిస్ 1976-78 మధ్యకాలంలో ఆ దేశ ప్రధానమంత్రిగా పనిచేశారు. 1980లలో మరోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. 1986-96 మధ్యకాలంలో పోర్చ్‌గల్ అధ్యక్షుడిగా పనిచేశారు. వృద్ధాప్యం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలతో ఆయన్ను గత నెలలో లిస్బన్లోని ఆసుపత్రిలో చేర్పించారు. తొలుత కోలుకున్నా తర్వాత కోమాలోకి వెళ్లిపోయారు. పోర్చుగల్‌లో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పే క్రమంలో ఆయన్ను సైనిక ప్రభుత్వాలు 12సార్లు జైల్లో ఉంచాయి. 1974 కార్నేషన్ తిరుగుబాటులో ఆయన కీలక పాత్ర పోషించారు.
తాజా వార్తలు
- తైవాన్‌లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించిన అమెరికన్ సాహసవీరుడు..!!
- సౌదీ పోర్టుల్లో 965 ప్రొహిబిటేడ్ ఐటమ్స్ సీజ్..!!
- దుబాయ్‌లో ఆస్తి కొనుగోలు చేస్తున్నారా?
- కువైట్ లోని లులు హైపర్ మార్కెట్లో ఇండియా ఉత్సవ్ వేడుకలు..!!
- 2050 నాటికి 83.6 మిలియన్లకు జీసీసీ జనాభా..!!
- బహ్రెయిన్ లో చైల్డ్ కేర్ కోసం కఠిన నిబంధనలు..!!
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు







