గంటలో 19 ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడిన మహిళ ....

- January 08, 2017 , by Maagulf
గంటలో 19 ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడిన మహిళ ....

ఓ మహిళా మోటరిస్టు కేవలం ఒక గంట వ్యవధిలో మొత్తం 19 ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. 19 రాడార్లు ఈ ఉల్లంఘనల్ని గుర్తించాయి. షేక్‌ జాయెద్‌ రోడ్‌పై ఈ ఉల్లంఘనలు చోటుచేసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఆమె యూరోపియన్‌ జాతీయురాలని ఆ అధికారి తెలిపారు. 40 ఏళ్ళ వయసుగల ఆ మహిళ పోర్షే కేయాన్‌ కార్‌లో రోడ్డపై నిబంధనల్ని ఉల్లంఘిస్తూ ప్రయాణించింది. దుబాయ్‌ పోలీస్‌ జనరల్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రాఫిక్‌ డైరెక్టర్‌ కల్నల్‌ సైఫ్‌ ముహైర్‌ అల్‌ మజ్రోయి మాట్లాడుతూ, ఓ మహిళ ఈ స్థాయిలో ఉల్లంఘనలకు పాల్పడటం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని అన్నారు. 220 నుంచి 240 కిలోమీటర్ల వేగంతో ఆ మహిళ దూసుకుపోయిందని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్ళేందుకే తాను అంత వేగంగా ప్రయాణించినట్లు ఆ మహిళ చెప్పారని అధికారులు వివరించారు. 120 కిలోమీటర్ల వేగం దాటితే 1,000 దిర్హామ్‌ల జరీమానా విధిస్తారు. ఆమె, జరీమానాని రద్దు చేయాల్సిందిగా పలుమార్లు విజ్ఞప్తి చేసుకున్నా, తగిన కారణం ఆమె చూపకపోవడంతో తాము ఆ విజ్ఞప్తుల్ని తిరస్కరించామని అధికారులు చెప్పారు. 

Shop Qatar mega-shopping event begins with colourful opening ceremony

షాప్‌ ఖతార్‌ మెగా షాపింగ్‌ ఈవెంట్‌ ప్రారంభం 
'షాప్‌ ఖతార్‌' మెగా షాపింగ్‌ ఈవెంట్‌ అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యింది. బారీ డిస్కౌంట్లు, అలాగే కొనుగోళ్ళపై భారీ బహుమతుల్ని ఆఫర్‌ చేస్తూ ప్రారంభమైన ఈ 'షాప్‌ ఖతార్‌'ని తిలకించేందుకు, షాపింగ్‌ చేసేందుకు పెద్దయెత్తున సందర్శకులు, వినియోగదారులు వస్తున్నారు. మాల్‌ ఆఫ్‌ ఖతార్‌లోని ఒయాసిస్‌లో ఈ మేరకు ఇనాగ్యురల్‌ ఈవెంట్‌ అద్భుతంగా జరిగింది. చీఫ్‌ మార్కెటింగ్‌ మరియు ప్రమోషన్‌ ఆఫీసర్‌ - ఖతార్‌ టూరిజం అథారిటీ రషెద్‌ అల్‌ కురెసీ, మాల్‌ ఆఫ్‌ ఖతార్‌ సిఇఓ అహ్మద్‌ అల్‌ ముల్లా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంప్రదాయ స్వార్డ్‌ డాన్స్‌ ఆహూతుల్ని విశేషంగా ఆకర్షించింది. రంగులు విరజిమ్మే ఫైర్‌ వర్క్స్‌ చూసి ఆహూతులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. 'ఎ బ్రాండ్‌ న్యూ ట్రెడిషన్‌' పేరుతో పలు కార్యక్రమాలు ఈ ఫెస్టివల్‌లో నిర్వహిస్తున్నారు. జనవరి 7 నుంచి ఫిబ్రవరి 7 వరకు ఈ ఈవెంట్‌ జరుగుతుంది. ఫిబ్రవరి 2 నుంచి 4 వరకు దోహా కామెడీ ఫెస్టివల్‌ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. తొమ్మిది దేశాలకు చెందిన 15 మంది కమెడియన్లు ఈ షోలో పాల్గొంటారు. ఇంకా పలు ఆసక్తికరమైన కార్యక్రమాల్ని షాప్‌ ఖతార్‌ నెల రోజుల షాపింగ్‌ మజాలో ఎంజాయ్‌ చేయొచ్చు డిస్కౌంట్లు, బంపర్‌ ప్రైజ్‌లతోపాటుగా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com