దక్షిణ థాయ్‌లాండ్‌లో వరదలు..35 మంది మృతి....

- January 09, 2017 , by Maagulf
దక్షిణ థాయ్‌లాండ్‌లో వరదలు..35 మంది మృతి....

సూరత్‌థానీ: థాయ్‌లాండ్‌లో వరదలు ముంచెత్తాయి. ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. నిత్యావసరాలు అందుబాటులో లేక కష్టాలు తప్పడం లేదు. అంటువ్యాధులు ప్రభలే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. దక్షిణ థాయ్‌లాండ్‌లోని సూరత్‌ధానీ రాష్ట్రంలో భారీ వర్షాలు కారణంగా వరదలు ఏర్పడ్డాయి. జనవరి 1 నుంచి ఇక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. 10 లక్షల మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 20 జాతీయ రహదారులపై వరదల ప్రభావం కనిపించింది. భారీ వర్షాల అనంతరం వరదల తాకిడికి 35 మంది చనిపోయినట్లు థాయ్‌లాండ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఇళ్ల చుట్టూ వరద నీరు పేరుకుపోవడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
నిత్యావసర వస్తువులు నిండుకున్నాయి. సరుకులు తెచ్చుకునే మార్గం లేక ఇబ్బందులు పడుతున్నారు. 60 వంతెనలు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. దాంతో భారీ వాహనాల రాకపోకలు నిలిపివేయాలని ఆదేశించారు.
విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com