జనతా గ్యారేజ్ రికార్డు బద్దలు కొట్టిన చరణ్..
- January 09, 2017
ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ చిత్రం ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిందో చెప్పనవసరం లేదు..ఎన్టీఆర్ కెరియర్లోనే సరికొత్త రికార్డు ను సృష్టించింది..అలాంటి జనతా రికార్డు ను బ్రేక్ చేసాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.
రామ్ చరణ్ - సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన 'ధృవ' సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెల్సిందే..హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ లోని మెయిన్ థియేటర్ లో ఎన్టీఆర్ వసూళ్లను బ్రేక్ చేసింది. జనతా గ్యారేజ్ మొత్తం మీద 94 లక్షల 66 వేల రూపాయలను వసూళ్లు చేయగా, చరణ్ నటించిన ధృవ ఆ రికార్డ్ ని బద్దలు కొట్టి 95 లక్షల 11 వేలతో సరికొత్త రికార్డ్ ని నమోదు చేసింది.
మరో పక్క ఓవర్సీస్ లోను ధృవ ఏ మాత్రం తగ్గడం లేదు..ఐదో వారానికి వచ్చిన కానీ ఇంకా స్క్రీన్స్ పెంచుకుంటూ పోతుందంటే అక్కడి ఆడియన్స్ కు సినిమా ఏ రేంజ్ లో నచ్చిందో అర్ధం అవుతుంది. చరణ్ కెరియర్ లో కూడా ధృవ చిత్రమే ది బెస్ట్ అనిపించుకుంటుంది.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







